RRR పై అవగాహన..స్వచ్ఛ సర్వేక్షన్‌లో ర్యాంక్ సాధించడమే లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ | LocalNews | Vinukonda.
▶
పల్నాడు జిల్లా :వినుకొండ పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ట్రిపుల్ ఆర్ (Reduce, Reuse, Recycle) సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ సిద్ధ లింగమూర్తి ఆదేశాలతో, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సూచనల మేరకు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం “రెడ్యూస్, రియూస్, రీసైకిల్” అనే సూత్రాన్ని ప్రజల్లో ప్రోత్సహించడం అని ఆయన వివరించారు. ప్రజలు తమ ఇళ్లలో పనికిరాని వస్తువులను తగ్గించుకోవడం, తిరిగి ఉపయోగించుకోవడం, అవసరమైతే రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని సూచించారు.అంతకు ముందు తిమయ్యపాలెం రోడ్డు లో సానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్స్మా, మున్సిపల్ద్యా సిబ్బంది తోపాటుగా స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, అవగహన కల్పించారు.

💬 Leave a Comment