ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా సుభాష్ చంద్రబోస్ బాధ్యతలు స్వీకరణ. | localnewstelugu | uyyur
ఏపీలో పలు చోట్ల మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఎం. సుభాష్ చంద్రబోస్‌ను ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో వినుకొండ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి. రమ్య కీర్తనను నరసరావుపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు. వినుకొండ మున్సిపాలిటీలో మేనేజర్‌గా ఉన్న కె. అర్జునరావును దర్శి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. పులివెందులలో ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఉన్న సి. మునికుమార్‌ను రెగ్యులర్ కమిషనర్‌గా నియమించగా, ఉయ్యూరులో కమిషనర్‌గా పనిచేస్తున్న జె. రామారావును తెనాలి మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.ఇక విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు తదితర నగరాల్లో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే పుట్టపర్తి, ఆత్మకూరు, యేలేశ్వరం వంటి మున్సిపాలిటీలకు కొత్త కమిషనర్లను నియమించారు.ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

💬 Leave a Comment