పోలీస్ వాహన సమాగ్రి బహిరంగ వేలం | localnewstelugu | Palnadu Dist
పల్నాడు జిల్లా : పోలీస్ శాఖలో వాడి పక్కన పెట్టిన వాహన సమాగ్రిని వేలం వేయనున్నట్లు ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు.
ఈ వేలం ప్రక్రియ ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు నరసరావుపేటలోని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయ ప్రాంగణంలో జరగనుంది.
ఆసక్తి కలిగిన వారు ఈ బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు.
వేలం పారదర్శకంగా జరుగుతుందని, పాల్గొనే వారు నిర్ణీత సమయానికంటే ముందే హాజరు కావాలని అధికారులు సూచించారు.

💬 Leave a Comment