రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి
– 95 సార్లు రక్తదానం చేసిన ప్రాణదాత పివి సురేష్ అందరికి స్ఫూర్తి
– మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్
ఆరోగ్యవంతులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వినుకొండ మునిసిపల్ కమిషనర్ కే.శివరాం ప్రసాద్ కోరారు. మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు వల్లెపు శ్రీనివాసరావు భార్యకి ఆపరేషన్ నిమిత్తం రక్తం అత్యవసరం కావడంతో మానవ సేవా సమితి అధ్యక్షులు, సీనియర్ కౌన్సిలర్ పివి సురేష్ బాబును సంప్రదించగానే స్పందించి రక్తదాత దోసకాయలపాటి రామయ్య అనే యువకుడి ద్వారా మంగళవారం సాయంత్రం రక్తదానం చేయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకునే ఒక సేవా భావం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ సురేష్ లాంటివారు ఉండటం వినుకొండ అదృష్టమని అన్నారు. మన సేవా సమితి అధ్యక్షులుగా పనిచేస్తూ వందలాది మంది యువకులు సేవా చైతన్యాన్ని నింపి ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవడం అభినందననీయమన్నారు. 95 సార్లు పైగా రక్తదానం చేసి 95 కుటుంబాలకు ప్రాణదాతగా నిలిచిన పీవీ సురేష్ బాబు నేటి యువతకు ఒక స్ఫూర్తి అన్నారు. పదవులతో కాదు సేవతో గొప్పవారు అవుతారని అందుకు నిదర్శనమే పీవీ సురేష్ అని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, చిన్నారులు, తల సేమియా తో బాధపడుతున్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, లాంటి అభాగ్యులకు అండగా మేమున్నామంటూ ఇవి సురేష్ ఆధ్వర్యంలో యువత ముందుకు వచ్చి అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం ఎంతో గర్వకారణం అన్నారు. 95 సార్లు రక్తదానం అంటే 95 కుటుంబాలకు ప్రాణం పోసిన మహానుభావుడని కొనియాడారు. అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు. మానవ సేవా సమితి అధ్యక్షులు, కౌన్సిలర్ పివి సురేష్ బాబు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేపడుతున్నామని, సోషల్ మాధ్యమంలో సేవాసమితి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి అత్యవసర వేల అవసరమైన వారికి రక్త దానం చేస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. రక్తం ఇది కేంద్రాల్లో కొన్ని గ్రూపులకు రక్తం దొరకక అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమాచారం అందగానే మానవ సేవా సమితి సభ్యులు, యువకులు స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నామని వివరించారు. రక్తదానం ఒకరి జీవితాన్ని నిలబెడుతుందనే నినాదంతో మా సమస్త ముందుకు నడుస్తుందని వివరించారు. ఎవరికైనా రక్తం అత్యవసరమైతే వినుకొండలో మానవ సేవా సమితి సభ్యులను సంప్రదించవలసిందిగా పివి సురేష్ బాబు కోరారు. కార్యక్రమంలో మానవ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

💬 Leave a Comment