📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
బుధవారం, అక్టోబర్ 21, 2026 | Wednesday, October 21, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
Screenshot 2026 04 06 19 20 05 174 com.whatsapp

బస్సులపై ప్రత్యేక తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన స్లీపర్ బస్సుకు భారీ జరిమానా…

బస్సులపై ప్రత్యేక తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన స్లీపర్ బస్సుకు భారీ జరిమానా…

సున్నిపెంట సమీపంలో రవాణా శాఖ అధికారులు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మరియు నంద్యాల జిల్లా రవాణా అధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహాలక్ష్మి ట్రావెల్స్ స్లీపర్ బస్సును ( నెంబర్ AR 01S 2221)అధికారులు పరిశీలించారు.ప్రమాదాల సమయంలో ప్రయాణికులు బయటకు రావడానికి ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారాలకు అడ్డంగా సీట్లు అమర్చినట్లు గుర్తించారు.అలాగే అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేయని స్థితిలో ఉన్నట్లు బయటపడింది.ఈ నిబంధనల ఉల్లంఘనలపై బస్సుకు 28 వేల రూపాయల జరిమానా విధించి, వాహనాన్ని జప్తు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు నంద్యాల జిల్లా, డోన్  మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.క్రాంతి కుమార్ తెలిపారు.ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో భద్రతా నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *