వినుకొండలో ఆక్రమణలపై కఠిన చర్యలు
స్పెషల్ ఆఫీసర్ పీడీ డ్వామా సిద్ధలింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్, CI ప్రభాకర్ కలిసి స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ఎలాంటి ఆలస్యం చేయకూడదని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల సమన్వయంతో తొలగింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

💬 Leave a Comment