రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి.. సుండిపెంట వద్ద సంయుక్త తనిఖీలు.
రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు సుండిపెంట పెట్రోల్ బంక్ వద్ద రవాణాశాఖ, పోలీస్, ఫైర్ శాఖలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నంద్యాల జిల్లా రవాణాశాఖ అధికారి జి. శ్రీకాంత్, శ్రీశైలం ఫైర్ ఆఫీసర్ బి. వెంకటేశ్వర్లు, సుండిపెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సుబ్బారావు పాల్గొన్నారు.
తనిఖీల సందర్భంగా డ్రైవింగ్ ఫిట్‌నెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్, వాహనాల ఫిట్‌నెస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా రవాణాశాఖ అధికారి జి. శ్రీకాంత్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
వాహనాల్లో తప్పనిసరిగా ఉండవలసిన ఫైర్ సిలిండర్లను తనిఖీ చేసి, వాటి పని తీరు గురించి వివరించారు. అలాగే మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో ఫైర్ ఆఫీసర్ బి. వెంకటేశ్వర్లు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
ఇక సుండిపెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రయాణ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినా, అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

💬 Leave a Comment