భూ వివాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: చీఫ్ విప్ జివి.
▶
భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను చీఫ్ విప్ జీవి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి రీ సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా ఒక పైసా అవినీతికి తావు లేకుండా క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.

💬 Leave a Comment