వినుకొండలో విద్యుత్ కష్టాలు: లో-వోల్టేజ్‌తో నరకం చూస్తున్న జనం!
వినుకొండ: పట్టణంలోని పలు వార్డుల్లో విద్యుత్ సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన లో-వోల్టేజ్ సమస్య వేధిస్తుండటంతో స్థానిక ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వోల్టేజ్ సరిగా లేకపోవడంతో వీధి దీపాలు వెలుగుతున్నా, ఇళ్లల్లో మాత్రం విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటోంది. తీవ్రమైన ఉక్కపోత కారణంగా పసిపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి ఏర్పాటు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని స్థానికుల ఆవేదన

💬 Leave a Comment