వినుకొండలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు ఆదేశాల మేరకు… పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని విద్యా వికాస్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరామప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం మరియు ప్రాసెసింగ్ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించి… పబ్లిక్ టాయిలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఇంట్లోనే హోమ్ కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలను వివరించి… వాటి స్థానంలో క్లాత్ బ్యాగులు లేదా బయోడిగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని కోరారు.వినుకొండను విజువల్ క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ… యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు. కార్యక్రమం చివరలో విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి, విద్యా వికాస్ స్కూల్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

💬 Leave a Comment