వినుకొండ పురపాలక సంఘం ముందస్తు చర్యలు
▶
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినుకొండ పురపాలక సంఘం ముందస్తు చర్యలు చేపట్టింది…
చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు…మున్సిపల్ అధికారులు పట్టణంలో డీసిల్టేషన్ పనులను ప్రారంభించారు.వరదలు నివారించడంతో పాటు…లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.పట్టణంలోని ప్రధాన కాలువలు, డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తూ…దోమల పెరుగుదలను అరికట్టడంపై కూడా దృష్టి సారించారు.వెన్నపూస వాగు మెయిన్ డ్రైన్, మార్కాపురం రోడ్, ఇసుక వాగు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి…మున్సిపల్ కమిషనర్ శివ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో…ఇంజనీర్ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.డీసిల్టేషన్ పనుల సమయంలో ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

💬 Leave a Comment