సర్వసభ్య సమావేశంలో సర్పంచులకు సత్కారం
▶
వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎం.పీ.పీ.పగడాల జయశ్రీ వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎం.పీ.డీ.వో ఎం. శ్రీనివాసరావు మండలంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.వేసవిలో తాగునీటి ఏద్దడి,విద్యుత్, సమస్యలు,పై ప్రధానంగా చర్చించారు.అనంతరం 2021- 25 సర్పంచులు గా బాధ్యతలు చేపట్టిన వారిని ఎంపీపీ జై శ్రీ వెంకటరామిరెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి రాజాలు ఘనంగా సత్కరించారు. సర్పంచులు అందుగులపాడు గుడిపాటి నాగేశ్వరరావు, బారతపురం తోట రమణ కుమారి, బ్రాహ్మణపల్లి గుడిమెట్ల సరా సరోజినీ, చాట్రగడ్డపాడు నక్కముర్తి రెడ్డి, చీకటీగలపాలెం బొబ్బ విజయలక్ష్మి, దొండపాడు బత్తుల సామ్రాజ్యం, గోకనకొండ వల్లెం శ్రీనివాసరావు, గొనుగుంట్లవారిపాలెం పాలడుగు సౌజన్య, హసనాయనిపాలెం నంబూరి భారతి, కొప్పుకొండ తల్లూరి గురుమూర్తి, కొప్పుకొండ తండా భుక్యా బికినీ బాయి, నాడిగడ్డ దేవర సంతోషం, నాగులవరం నూనె కోటేశ్వరరావు, నరగాయపాలెం వజ్రాల నాగిరెడ్డి, నీలగంగవరం కోటపాటి పద్మావతి, పెదకంచెర్ల అమృపూడిద రత్న కుమార్, పిట్టంబాండ రాసపుత్ర లక్ష్మి బాయి, శివాపురం కమతం శేషి రెడ్డి, తిమ్మాయపాలెం, ఉమ్మడివరం వీరగంధం ఆనంద్, ఉప్పరపాలెం గోపు కృష్ణ, వెంకుపాలెం కంచర్ల మాణెమ్మ, విఠంరాజుపల్లి పెనుమాల సుమలత,లు సత్కారం అందుకున్నారు.

💬 Leave a Comment