తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి లీగల్ సెల్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, సీనియర్ న్యాయవాదులు పొట్లూరి సైదారావు, రామకోటేశ్వరరావు, ముప్పాళ్ల జ్ఞానేశ్వర్ రావు పార్టీ సిద్ధాంతాలపై మాట్లాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావుతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
చివరగా లీగల్ సెల్ కార్యదర్శి దూళ్ల నాగరాజు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

💬 Leave a Comment