తిరుణాల ఏర్పాట్లపై సమీక్ష
మదమంచిపాడు గ్రామంలో జరగనున్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో ఈ సమావేశాన్ని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున నిర్వహించారు.
ఏప్రిల్ 6న జరగనున్న తిరుణాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, విద్యుత్, లైటింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
న్యూజిలాండ్ నుండి వర్చువల్గా మాట్లాడిన జీవి ఆంజనేయులు, తిరుణాల ఏర్పాట్లపై కీలక మార్గదర్శకాలు అందించారు. సమావేశంలో పోలీస్ అధికారులు, ఎమ్మార్వో, టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

💬 Leave a Comment