వినుకొండలో విద్యుత్ సరఫరా నిలిపివేత |localnewstelugu | vinukonda
వినుకొండ: పట్టణంలోని వినియోగదారులకు విద్యుత్ శాఖ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. రేపు (ఆదివారం, ఏప్రిల్ 26) వినుకొండ టౌన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. అత్యవసర విద్యుత్ మరమ్మత్తు పనుల దృష్ట్యా, ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు. SS-1, SS-2, SS-3 సబ్ స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరపరకు అంతరాయం ఏర్పాటునున్నట్లు వినుకొండ అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు విద్యుత్ శాఖ పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

💬 Leave a Comment