ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం మావిగన్ :మాజీ మంత్రి అంబటి రాంబాబు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి అంబటి రాంబాబు… మాజీ మంత్రి విడదల రజిని ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ…
విడదల రజిని వైఎస్సార్‌సీపీ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెకు సంఘీభావం తెలిపినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ…
వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెడుతోందని ఆరోపించారు.
తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
టీడీపీ నాయకులు తన ఇంటిపై గంటల పాటు దాడి చేశారని,దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా… వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో చట్టవ్యవస్థ సరిగా లేదని,పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మరో మూడు సంవత్సరాల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని,జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మావిగన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని,అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రంగా మారుతుందని పేర్కొన్నారు.

💬 Leave a Comment