శాశ్వత రాజధానిగా అమరావతి…అసెంబ్లీలో సీఎం తీర్మానం.
▶
రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

💬 Leave a Comment