📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1212457

ముగిసిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన | localnewstelugu | vinukonda

పల్నాడు జిల్లా: వినుకొండ. మండలంలోని మదమంచిపాడు గ్రామంలో శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అత్యుత్తమ గిత్తలు తమ బలాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను అలరించాయి. పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజినేయులు సతీమణి శ్రీమతి గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. భారీ సంఖ్యలో రైతులు, గ్రామస్తులు హాజరుకాగా, వేడుక కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా గోనుగుంట్ల లీలావతి మాట్లాడుతూ, ఎడ్ల పందేలు కేవలం క్రీడ మాత్రమే కాకుండా మన పూర్వీకుల సంస్కృతి ప్రతిబింబమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంపద అభివృద్ధికి ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రైతులు తమ పశువులను ఎంతో ప్రేమతో పెంచి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించడం గర్వకారణమన్నారు.అనంతరం డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, పల్నాడు ప్రాంతానికి ఎడ్ల బల ప్రదర్శన ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందన్నారు. రైతుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తిరుణాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. బహుమతులు అందుకున్న ఎడ్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటి పోటీలు మరింతగా నిర్వహించాలని కోరారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *