వినుకొండలో రేపు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు ఇవే
విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం రేపు ఏప్రిల్ 6, సోమవారం వినుకొండ టౌన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉండనుంది…రజక కాలనీలోని ఎస్ఎస్-3 సబ్స్టేషన్ నుంచి తిమ్మాయపాలెం రోడ్డులోని ఎస్ఎస్-2 సబ్స్టేషన్ వరకు కొత్త 33 కేవీ లైన్ ఏర్పాటు పనుల నేపథ్యంలో ఈ పవర్ కట్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు…ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు…నవాజ్ కుంట, పెద్ద బోరింగ్ సెంటర్, బోసు బొమ్మ సెంటర్, ఇసుక వాగు బజార్, కొండమెట్ల బజార్, కోటనాల్సా బజార్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ప్రభావం ఉంటుందని తెలిపారు…కావున ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.

💬 Leave a Comment