పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
▶
వినుకొండ పట్టణం, తిమ్మాయపాలెం రోడ్డులోని నిమ్మల బావి బజార్లో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన్నట్లు వైస్ ప్రెసిడెంట్ బేతంచెర్ల పెద్ద నరసింహారావు, సెక్రటరీ గంగనగుంట్ల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ కొల్లి కోటేశ్వరరావు, ట్రెజరర్ ఇమ్మడి నారాయణ తెలిపారు.అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిపి, భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన ప్రసాద వితరణ చేపట్టినట్టు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి వినుకొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు,వాలంటీర్లు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

💬 Leave a Comment