శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత |localnewstelugu | srisailam.
శ్రీశైలంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా మద్యం, నాటుసారా పట్టుబడటం కలకలం రేపింది. మాణిక్య మ్మసెల, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధరామప్ప కాంప్లెక్స్ సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆత్మకూరుకు చెందిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

💬 Leave a Comment