📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
బుధవారం, అక్టోబర్ 21, 2026 | Wednesday, October 21, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1155327

ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో శ్రీ విజేత విద్యార్థుల సత్తా 22 మంది రాష్ట్రస్థాయికి ఎంపిక

Video ▶

ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలలో వినుకొండ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని, స్కూల్ కరస్పాండెంట్ కావూరి సాయికుమార్ తెలిపారు.

ఒలంపియాడ్ సెకండ్ లెవెల్ పరీక్ష పోటీలలో తమ పాఠశాల నుండి పాల్గొన్న 22 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి అర్హత సాధించి 100% ఫలితాలు నమోదు చేశారన్నారు. జోనల్ స్థాయిలో సిహెచ్. మనీ శ్రీ చరణ్ – 86వ ర్యాంకు.యు. వెంకట తేజ – 129వ ర్యాంకు.ఎ. రేష్మ చౌదరి – 175వ ర్యాంకు. కే. ఆశ్రిత్ – 179వ ర్యాంకు.ఎ. సౌజన్య – 200వ మెరుగైన ర్యాంకులతో సత్తా చాటాలని తెలిపారు. విజేతలను పాఠశాలలో ఘనంగా సత్కరించి మేనేజింగ్ డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మం తో కలిసి మెమొంటోలు అందజేశామన్నారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.విజయానికి కారణమైన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *