సంసిధ్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సంబరాలు. In Samsidh School | localnewstelugu | vinukonda
పల్నాడు జిల్లా :శావల్యపురం మండలం కనమర్లపూడిలోని సంసిధ్ పాఠశాలలో నెలవారీ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని స్కూలు ప్రిన్సిపల్ సాగర్ బాబు తెలిపారు. అన్ని తరగతుల విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం జరిగిందని,U.K.G నుండి 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. నవీన్ రెడ్డి వజ్రాల, డా. సాయి దివ్య, సురేష్ మెట్ల హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మాట్లాడుతూ..జీవితంలో ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని సూచిస్తూ అవగాహన కల్పించారని వెల్లడించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు, పాటల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుందన్నారు.

💬 Leave a Comment