M.E.O గ పదోన్నతి పొందిన చిన కోటేశ్వరరావుకు సత్కారం
వినుకొండలోని సాధన ట్యూషన్ సెంటర్‌లో కురిచేడు మండల విద్యాశాఖ అధికారిగా (MEO) పదోన్నతి పొందిన చిన కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఎస్కే.ఎం బాష ఆధ్వర్యంలో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూల్లా మాట్లాడుతూ కోటేశ్వరరావు నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. కురిచేడు మండల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కవి కరిముల్లా కూడా ఆయన ప్రతిభను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

💬 Leave a Comment