హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన – సాగర్ రింగ్ రోడ్‌పై ట్రాఫిక్ స్థంభనం
హైదరాబాద్‌లో సాగర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్ సరఫరాలో సమస్యలు కొనసాగుతుండటంతో ఆగ్రహించిన డ్రైవర్లు హైవేపై తమ ఆటోలను అడ్డంగా నిలిపి నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆటో డ్రైవర్లు ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనతో నగరంలో మరోసారి గ్యాస్ సరఫరా సమస్యపై చర్చ మొదలైంది.

💬 Leave a Comment