గీతమ్స్ బ్లుమ్స్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు | localnewstelugu | vinukonda
▶
తమ విద్యార్థులు ఐదవ తరగతి పూర్తి చేసుకుని, ఆరవ తరగతిలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలో స్కూల్ కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకను ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో పురస్కారం అందజేసినట్టు బ్లుమ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ అను రెడ్డి తెలిపారు. ఈ పురస్కార అవార్డులను కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల విద్యా ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని, తమ విద్యార్థులు ఐదవ తరగతి విజయవంతంగా పూర్తి చేసి, కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భం తమకు ఎంతో గర్వంగా ఉందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,చదువుతో పాటు విలువలు, క్రమశిక్షణ కూడా సమానంగా అవసరం అన్నారు. తమ పాఠశాలలో ఈ రెండింటినీ సమన్వయంగా ఆదిస్తునామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

💬 Leave a Comment