📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
సోమవారం, అక్టోబర్ 19, 2026 | Monday, October 19, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1000301527 1

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల అప్రమత్తంగా ఉండాలి – డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

 రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి సూచించారు. ఈ మేరకు మంగళవారం  పత్రికా ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చని, దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా ఆహారం తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించి గొడుగు, టోపీ లేదా కర్చీఫ్ వంటివి వెంట తీసుకెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు, కూలీలు ఎండలో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు అనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. వృత్తిరీత్యా వైద్య పట్టభద్రుడైన ఆయన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు చేశారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *