చీఫ్ విప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
పల్నాడు జిల్లా: వినుకొండ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి జివి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య ప్రోత్సాహానికి మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

💬 Leave a Comment