📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1163812

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివాదం…

సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య స్పందించింది.

సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు వినుకొండలో జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడుతూ…

మంద కృష్ణ మాదిగ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు పెంచేలా ఉన్నాయని అన్నారు.

బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉండే వ్యవస్థను రద్దు చేయాలని,

సమాజంలో సమానత్వం కోసం అన్ని వర్గాలకు అర్చకత్వం అవకాశం కల్పించాలని,కులవ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించగా   

 ఈ వ్యాఖ్యలపై స్పందించిన గాలి శ్రీనివాసరావు…

వేదాలు అభ్యసించిన ఎవరైనా పూజారులుగా అర్హులేనని, ఇప్పటికే అనేక దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులుగా పనిచేస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అర్చకత్వ శిక్షణ ఇచ్చి నియామకాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి సమస్యకు బ్రాహ్మణులను కారణం చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం తగదని,సమాజంలో కులమతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం హర్షణీయం కాదని అన్నారు.

అయితే… కులవ్యవస్థ నిర్మూలనపై మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ…

అస్పృశ్యత తొలగి సమానత్వం ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.

అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగి…

దేశ అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాఖ్యకు చెందిన పలు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *