📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1137394

ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం – 3000 మందికి అన్నదానం

వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమితి రూపకర్త చామర్తి భవాని శంకర్ నాయకత్వంలో నిర్వహించారు.

ఈ వేడుకలకు సమితి సభ్యులు అమీర్ జాన్, పీవీ సురేష్ బాబు, జెడ్డా వెంకటేశ్వర్లు, రమణయ్య, కొండలు, వీరాంజి, పులిపాటి హనుమంతరావు, శివాజీ, వెంకటేష్ తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 3000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, భక్తులు, పట్టణ ప్రముఖులు, నిర్వాహకులకు భవాని శంకర్ మరియు పీవీ సురేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, “అందరూ బాగుండాలి… అందులో మనం ఉండాలి” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సేవా భావం పెంపొందించాలని నిర్వాహకులు తెలిపారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *